ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాలార్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ యాక్షన్ ఎపిక్ సాలార్‌లో సాండల్వూడ్ హీరో యష్ అతిధి పాత్రలో నటించే అవకాశం ఉంది అని లేటెస్ట్ టాక్. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.
అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న సాలార్ చిత్రం సెప్టెంబరు 28, 2023న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో గోపీ, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.