కాసేపటి క్రితమే అమిగోస్ సెకండ్ సింగిల్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. అంతకుముందు జరిగిన ప్రచారం మేరకే నటసింహం నందమూరి బాలకృష్ణ గారి ఐకానిక్ రొమాంటిక్ సింగిల్ 'ఎన్నో రాత్రులొస్తాయి' పాటను అమిగోస్ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు మరోసారి వాడుతున్నారు. ఎన్నో రాత్రులొస్తాయి రీమిక్స్ వెర్షన్ ను అమిగోస్ సెకండ్ సింగిల్ గా విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం నిర్ణయిస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. ఈ మేరకు జనవరి 29 సాయంత్రం 05:09 నిమిషాలకు ఎన్నో రాత్రులొస్తాయి రీమిక్స్ వెర్షన్ సాంగ్ విడుదల కాబోతుంది.
పోతే, కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ మూవీ 'పటాస్' లో కూడా బాబాయ్ బాలయ్య 'అరే ఓ సాంబా' పాటను రీమిక్స్ చేసారు. ఆ పాట హిట్టే.. ఆ సినిమా కూడా హిట్టే. ఇలా చూసుకుంటే, అమిగోస్ కూడా సూపర్ హిట్టే.