టాలీవుడ్ యువనటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "వినరో భాగ్యము విష్ణుకథ". ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బురు డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. కాశ్మీర పరదేశీ హీరోయిన్ గా నటిస్తుంది. VBVK ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా లిరికల్ సాంగ్స్ వాసవ సుహాస, ఓహ్ బంగారం పాటలు శ్రోతలను విపరీతంగా అలరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ VBVK థర్డ్ సింగిల్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధంచేసారు. ఈ మేరకు థర్డ్ సింగిల్ రిలీజ్ అప్డేట్ రేపు ఉదయం 10:05 నిమిషాలకు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు.