ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లవ్ మౌళి' నుండి నవదీప్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 26, 2023, 05:51 PM

టాలీవుడ్ యువ నటుడు నవదీప్ చాలా కాలం తరవాత లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం "లవ్ మౌళి". రొమాంటిక్ లవ్ స్టోరీగా, రోడ్ జర్నీ నేపథ్యంతో సాగే ఈ చిత్రాన్ని అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నైరా క్రియేషన్స్ పతాకంపై తాటికొండ ప్రశాంత్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఈ రోజు నవదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలియచేస్తూ, చిత్రబృందం సరికొత్త పోస్టర్ ను విడుదల చేసింది. సరికొత్త మేకోవర్ తో నవదీప్ లుక్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎప్పుడూ క్లీన్ షేవ్ తో కనిపించే నవదీప్ ఈ సినిమా కోసం జుట్టు, గడ్డం బాగా పెంచేసాడు. మోడరన్ దేవ్ దాస్ లుక్ లో కనిపిస్తూ సినిమాపై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. 
ఈ సినిమాలో బైక్ ట్రావెలర్ గా నవదీప్ కనిపించనున్నాడు.నవదీప్ సరసన పంఖరీ గిద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. సరికొత్త తరహా ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై నవదీప్ భారీ హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమాతోనైనా నవదీప్ హీరోగా మంచి విజయం అందుకోవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com