కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తన తదుపరి సినిమాని తలపతి విజయ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ప్రాజెక్ట్ గురించిన అప్‌డేట్ ని మూవీ మేకర్స్ వెల్లడించనున్నారు అని కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.