ఈరోజు ఉదయం విడుదలైన "రావణాసుర" స్పెషల్ గ్లిమ్స్ యూట్యూబ్ టాప్ ప్లేస్ ను కైవసం చేసుకుని 1 మిలియన్ వ్యూస్ తో హంగామా చేస్తుంది. బాడ్ బాయ్ గా రవితేజ లుక్, యాటిట్యూడ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవగా, ఫుల్ లెంగ్త్ సినిమాలో ఆయన నటన ఎలా వుండబోతుందోనని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పోతే, ఈ రోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రావణాసుర నుండి స్పెషల్ గ్లిమ్స్ విడుదల చెయ్యడం జరిగింది.
క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, సుశాంత్ విలన్గా నటిస్తున్నారు. అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ కీరోల్స్ లో నటిస్తున్నారు. ఏప్రిల్ 7వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.