మంచు లక్ష్మి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం "అగ్ని నక్షత్రం". వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు గారు కీలకరోల్ లో నటిస్తున్నారు. ఫస్ట్ టైం తండ్రి కూతుళ్లు కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.
లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్లపై మోహన్ బాబు, మంచు లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. సముద్రఖని, విశ్వంత్, చైత్ర శుక్ల తదితరులు నటిస్తున్నారు.