వంశీ డైరెక్షన్లో మాస్ రాజా రవితేజ నటిస్తున్న చిత్రం "టైగర్ నాగేశ్వరరావు". ఈ మూవీలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. GV ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా టైగర్ నాగేశ్వరరావు విడుదల తేదీపై అఫీషియల్ క్లారిటీ వస్తుంది. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నిర్వహించిన స్పెషల్ ట్విట్టర్ స్పేస్ లో నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. టైగర్ నాగేశ్వర రావు చిత్రం ఈ ఏడాదిలోనే విడుదలవుతుందని, పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుందని చెప్పుకొచ్చారు.