ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "కోనసీమ థగ్స్". కాసేపటి క్రితమే ట్రైలర్ విడుదలైంది. రా & రస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్, నటీనటుల అద్భుతమైన ప్రదర్శనతో ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. అతి త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది.
ఈ సినిమాలో బాబీ సింహ, RK సురేష్, మునిష్కంత్, అనశ్వర రాజన్, శరత్ అప్పాని, హ్రిదు హరూన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సామ్ CS సంగీతం అందిస్తున్నారు. HR పిక్చర్స్, జిఓ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై రియా శిబు, ముంతాస్ M నిర్మిస్తున్నారు.