భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ZEE5 ఒకటి. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, లూజర్ 2, గాలివాన, పేపర్ రాకెట్ మరియు హలో వరల్డ్ వంటి వెబ్ సిరీస్ ని రూపొందించిన ZEE5 ఇప్పుడు 'ATM' అనే టైటిల్ తో మరో వెబ్ సిరీస్ ని రూపొందించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సిరీస్ లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 టైటిల్ విజేత VJ సన్నీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ జనవరి 20, 2023న ఈ సిరీస్ ప్రీమియర్ గా అందుబాటులోకి వచ్చింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ హీస్ట్ డ్రామా థ్రిల్లర్ 'ATM' 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను క్లాక్ చేసినట్లు సమాచారం. చంద్ర మోహన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సుబ్బరాజు, రోయల్ శ్రీ, రవిరాజ్, కృష్ణ బురుగుల తదితరులు కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్‌లోని మురికివాడలకు చెందిన నలుగురు యువకుల కథే 'ATM'. ప్రశాంత్ ఆర్ విహారి ఈ సిరీస్ కి సంగీతం అందించారు. దిల్ రాజు నిర్మాణంలో శిరీష్ మరియు హరీష్ శంకర్ సమర్పణలో హర్షిత్ రెడ్డి మరియు హన్షిత ఈ వెబ్ సిరీస్ ని నిర్మించారు.