సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. శుక్రవారం వర్కింగ్ డే కావడంతో ఈ సినిమా నెమ్మదించినప్పటికీ దాదాపు 35 కోట్లు వసూలు చేసింది. ఈ ప్రక్రియలో బాహుబలి 2 మరియు KGF2 కలెక్షన్లను అధిగమించి బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా పఠాన్ నిలిచింది.
తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ 3వ రోజు మొత్తం ఇండియాలో 34 నుండి 38 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఈ సినిమా మూడు రోజుల వసూళ్లు దాదాపు 160 కోట్ల వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుంది. హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం ఈ బిగ్గీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa