ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సరికొత్త ఫోటో షూట్ తో ఫ్యాన్స్ ని పలకరించారు. చేత గులాబీలు పట్టుకొని కళ్ళతో కవ్వించింది. నభా సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అవుతుంది. ఆమెకు ఆఫర్స్ రావడం లేదు. అయితే ఆమె సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు.గాయం కారణంగా మానసిక, శారీరక ఒత్తిడికి గురయ్యానని నభా సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. నభా పరిస్థితి తెలుసుకున్న ఫ్యాన్స్ బాధపడ్డారు. ఆమె కమ్ బ్యాక్ కావాలని తిరిగి సినిమాల్లో నటించాలని కోరుకున్నారు.నభా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఫిదా చేస్తున్నారు. మూడు మిలియన్స్ కి పైగా ఆమెకు ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉండగా వాళ్ళను తన గ్లామర్ తో ఆకట్టుకుంటున్నారు.
A ROSE BY ANY OTHER NAME WOULD SMELL AS SWEET !
- William Shakespeare pic.twitter.com/TDVV2BGtei
— Nabha Natesh (@NabhaNatesh) January 30, 2023