వంశీ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కృతి సనన్ సోదరి నుపుర్ సనాన్ అండ్ ప్రముఖ మోడల్ గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించనున్నారు. ఈ సినిమాలో బద్రి నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ హేమవతి లవణం అనే క్యారెక్టర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు, ఆమె ఈ చిత్రానికి సంబంధించిన తన షూటింగ్ భాగాన్ని ముగించినట్లు సమాచారం. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసి మొత్తం మూవీ టీమ్‌కి ధన్యవాదాలు తెలిపింది.
ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.