చెన్నై: తనదైన శైలిలో చిత్రాలను చేస్తూ ముందుకు దూసుకుపోతున్న తమిళ కథానాయకుడు ధనుష్. తమిళంలోనే కాదు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఆయన చిత్రాలు విడుదలవుతున్నాయి. బాలాజీ మోహన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన చిత్రం ‘మారి’. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘మాస్’ పేరుతో విడుదల చేశారు. ఇప్పుడు ధనుష్ ఈ చిత్రానికి సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు. ఇందులో కథానాయికగా చిత్ర బృందం సాయిపల్లవిని ఎంపిక చేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళ నటుడు టోవినో థామస్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వచ్చే నెలలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.
మలయాళ ‘ప్రేమమ్’తో ఆకట్టుకున్న సాయిపల్లవి ఇటీవల శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’లోనూ అలరించింది. ఇప్పుడు ధనుష్ సరసన ‘మారి2’లో అవకాశం దక్కించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa