రమేష్ రాపర్తి దర్శకత్వం వహిస్తున్న సినిమా "మాయాపేటిక". ఈ సినిమాలో విరాజ్ అశ్విన్, పాయల్ రాజ్ పుత్, సునీల్, సిమ్రత్ కౌర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. శరత్ చంద్రా రెడ్డి, తారక్ నాధ్ బొమ్మి రెడ్డి నిర్మిస్తున్నారు.
రీసెంట్గానే మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసిన ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ గా 'షన్నాషన్నా' సాంగ్ విడుదలై, మెలోడీ ప్రియులను విశేషంగా అలరిస్తుంది. యూట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న ఈ పాటను గుణ బాలసుభ్రమణియన్ స్వరపరచగా, యశశ్వి కొండేపూడి, ప్రజ్ఞ నాయని ఆలపించారు. శ్రీమణి లిరిక్స్ అందించారు.
రజత్ రాఘవ్, పృథ్వి రాజ్, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, శ్యామల తదితరులు కీలకపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa