ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వసంత కోకిల : అదిగో అదిగో వీడియో సాంగ్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 08, 2023, 06:27 PM

కన్నడ నటుడు బాబీ సింహ, కాశ్మీర పరదేశి జంటగా నటిస్తున్న చిత్రం "వసంత ముల్లై / వసంత కోకిల". కన్నడ, తమిళ్, తెలుగు  త్రిభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా యొక్క ట్రైలర్ రీసెంట్గానే విడుదలైంది. రమణ పురుషోత్తమ దర్శకత్వంలో మిస్టరీ లవ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో  కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య కీలకపాత్రలో నటిస్తున్నారు. రాజేష్ మురుగేశన్ సంగీతం అందించారు.


కాసేపటి క్రితమే ఈ సినిమా నుండి అదిగో అదిగో అనే రొమాంటిక్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా, గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు.


పోతే, తమిళం, తెలుగు, కన్నడ భాషలలో ఈ సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa