ఎఫ్ 2కి హిట్ టాక్ వచ్చినపుడు పండగ అడ్వాంటేజ్‌తో నలభై కోట్లు వస్తాయని అంచనా వేసారు. ఆ తర్వాత సంక్రాంతికి జోరు చూసి యాభై కోట్లు సాధ్యమేనన్నారు. అటుపై అరవై కోట్లకి అంచనాలని అడ్జస్ట్ చేసుకున్నారు. కట్ చేస్తే... పదకొండు రోజుల్లోనే అరవై కోట్ల షేర్‌ని అధిగమించిన ఈ చిత్రం జోరు ఇంకా తగ్గలేదు.
హాలిడేస్ అయిపోయాక సెలవు లేని రోజుల్లో కూడా అదరగొట్టేస్తోంది. పురుషులకి, లేడీస్‌కి కూడా సమానంగా కనక్ట్ అయిన ఈ చిత్రం ఫుల్ రన్‌లో డెబ్బయ్ అయిదు కోట్లు వసూలు చేస్తుందని తాజా అంచనాలు చెబుతున్నాయి. ఈ వారంలో మిస్టర్ మజ్ను వస్తున్నా కానీ శని, ఆదివారాల్లో ఎఫ్2 జోరు మామూలుగా వుండదని అంటున్నారు.
ఏ సినిమా సక్సెస్‌ని అయినా మొదటి రోజు మొదటి ఆటకి అంచనా వేసే దిల్ రాజు కూడా తన సినిమా సాధిస్తోన్న సంచలనాలు చూసి అవాక్కవుతున్నాడు. ఈ ఘన విజయంతో అనిల్ రావిపూడి ఇప్పుడు హాట్ ఫేవరెట్ అయిపోగా, వెంకటేష్ మళ్లీ డిమాండ్‌లోకి వచ్చేసాడు. వెంకటేష్‌తో హాస్యభరిత కుటుంబ కథా చిత్రాలు తీయాలనే ఆలోచనలో చాలా మంది నిర్మాతలు అలాంటి కథలు వండిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa