ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాట్ స్టార్ లో "రాజయోగం" స్ట్రీమింగ్..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 09, 2023, 05:34 PM

సాయి రోనక్, అంకితా సాహా జంటగా నటించిన చిత్రం "రాజయోగం". రామ్ గణపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అరుణ్ మురళీధరన్ సంగీతం అందించారు. శ్రీ నవబాలా క్రియేషన్స్ , వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై మణి లక్ష్మణ్ రావు నిర్మించారు.


రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా పదివేల కోట్ల విలువ చేసే డైమండ్స్ కోసం పాత్రధారులు ఛేజింగ్ చేసే నేపథ్యంలో సాగుతుంది. పోతే, గతేడాది డిసెంబర్ 30న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విఫలమైంది. 


తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ రోజు నుండి రాజయోగం సందడి చెయ్యడం స్టార్ట్ చేసింది. థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమా డిజిటల్ లో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa