సాయిరాం శంకర్, యషా శివకుమార్ జంటగా నటిస్తున్న చిత్రం "వెయ్ దరువెయ్". నవీన్ రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శంకర్ పిక్చర్స్ పతాకంపై దేవరాజ్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుండి ఇటీవలే టైటిల్ వీడియో సాంగ్ ను టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య విడుదల చేసారు.
ఇప్పుడు వెయ్ దరువెయ్ మూవీ నుండి టీజర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు అతి త్వరలోనే వెయ్ దరువెయ్ టీజర్ విడుదల కాబోతుందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa