ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 15, 2023, 05:06 PM

"గుడుంబా శంకర్", "భద్ర", "గోరింటాకు" వంటి సినిమాలలో నటించి తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయినా మలయాళీ నటి మీరా జాస్మిన్ గురించి అందరికి తెలుసు. ఆమె తెలుగులో చివరిగా 2013లో విడుదలైన "మోక్ష" సినిమాలో కనిపించింది. ఈ గ్లామర్ బ్యూటీ సినిమాల్లో కనిపించి దాదాపు పదేళ్లు అవుతోంది.


తాజాగా ఇప్పుడు నటి కొత్త చిత్రం 'విమానం' తో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది.ఈరోజు బ్యూటీ పుట్టినరోజు కావడంతో, ఈ తమిళ తెలుగు సినిమాలో మెయిన్ రోల్ కనిపించనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ సినిమాలో సముద్రఖని కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు విమానం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com