కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, డైరెక్టర్ శంకర్ షణ్ముగం కూతురు అదితి శంకర్ జంటగా నటిస్తున్న చిత్రం "మావీరన్". ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మడోన్నా అశ్విన్ డైరెక్షన్లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులో "మహావీరుడు" గా రాబోతుంది.
అతి త్వరలోనే ఈ సినిమాపై మేజర్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు నిన్న పేర్కొన్న మేకర్స్ తాజాగా కాసేపటి క్రితం సర్ప్రైజింగ్ ఎనౌన్స్మెంట్ చేసారు. సాయంత్రం ఆరున్నరకు మావీరన్ ఫస్ట్ సాంగ్ యొక్క చిన్న గ్లిమ్స్ వీడియోను విడుదల చెయ్యబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.