విష్ణు శశి శంకర్ దర్శకత్వంలో మాలీవుడ్ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటించిన 'మలికప్పురం' సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఒటిటి ప్లాట్ఫారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 15న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ డివైన్ హిట్‌లో సైజు కురుప్, మనోజ్ కె జయన్, రాంజీ పనికర్, రమేష్ పిషారోడి తదితరులు కీలక పాత్రలు పోషించారు. నీతా పింటో, ప్రియా వేణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రంజిన్ రాజ్ సంగీతం అందించారు.