ఈ శనివారం విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న "శ్రీదేవి శోభన్ బాబు" చిత్రం నుండి కాసేపటి క్రితమే ఆడియో జ్యూక్ బాక్స్ విడుదలయ్యింది. సయ్యద్ కమ్రాన్ ఈ సినిమాకు అందించిన బాణీలను ఇప్పుడు ఒకేసారి, ఒకేచోట వినొచ్చు.
సంతోష్ శోభన్, గౌరీ జి కిషన్ జంటగా, దర్శకుడు ప్రశాంత్ దిమ్మల తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.