ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ 'ఫార్జి' అనే టైటిల్ తో మరో వెబ్ షోని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఫిబ్రవరి 10 నుండి ఫర్జి డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో కి వచ్చింది. ఈ వెబ్ షో విమర్శకుల నుండి అత్యంత సానుకూల స్పందనను పొందింది. ఈ షో ప్రస్తుతం US, UAE, UK, ఆస్ట్రేలియా, కెనడా మరియు సింగపూర్ వంటి ప్రాంతాలలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ టెన్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ భారతదేశంలో కూడా రైమ్ వీడియో చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలలో నటించారు. ఫ్యామిలీ మ్యాన్ దర్శక ద్వయం రాజ్ మరియు డికె ఈ సిరీస్‌ను రూపొందించారు. కే కే మీనన్, రాశి ఖన్నా, అమోల్ పాలేకర్ మరియు భువన్ అరోరా ఈ సిరీస్ లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.