యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త చిత్రం "వినరో భాగ్యము విష్ణుకథ". కొత్త దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో సరికొత్త కధాంశంతో రూపొందిన ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా రేపే విడుదల కాబోతుంది.
కాన్సెప్ట్ తో మొదలై, లవ్, కామెడీ మిక్స్ అయ్యి, క్రైమ్ నుండి సస్పెన్స్ వైపుకు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా, ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని కలిగించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ గారు సమర్పిస్తున్నారు. కన్నడ నటి కాశ్మీర పరదేశి హీరోయిన్ గా నటిస్తుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa