దర్శకుడు పా రంజిత్‌తో స్టార్ హీరో విక్రమ్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. 1800ల నాటి నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా టైటిల్ గ్లింప్స్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ రోజు ఈ చిత్రం సెట్స్ నుండి విక్రమ్ తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని చిత్రాలను పోస్ట్ చేసారు. ఈ పిక్స్ లో విక్రమ్ పొడవాటి గడ్డం మరియు జుట్టుతో కనిపిస్తున్నారు. నటుడి రగ్డ్ లుక్స్ సినిమా ఎంత ఇంటెన్స్ గా ఉండబోతుందో తెలియజేస్తున్నాయి.
ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు, పశుపతి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ రానున్న రోజులలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa