ఢీ, రెడీ, సై వంటి బ్లాక్ బస్టర్స్ తో తెలుగులో కొనేళ్లు స్టార్ హిరోయిన్ గా వెలిగింది జెనీలియా. అయితే రితేష్ తో పెళ్లి తర్వాత పూర్తిగా వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించింది. భర్త రితేష్ తో ఆమె నటించిన 'వేద్' సినిమా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మాట్లాడిన జెనీలియా..'పెళ్లి అయ్యాక వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించా. సినిమాలు చేస్తూ ఇంటిని చూసుకోవడం కుదరలేదు. అందుకే సినిమాలు వదిలేశా' అని చెప్పింది.