బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం "Mrs. ఛటర్జీVs నార్వే". ఈ రోజు ఈ మూవీ ట్రైలర్ విడుదలయ్యింది. నార్వే దేశంలో నివాసముంటున్న హ్యాపీ ఫ్యామిలీలో అనుకోకుండా ఒక ఉపద్రవం. రాణీముఖర్జీ పిల్లలు కిడ్నాప్ చెయ్యబడతారు. ఒక దేశానికి ఎదురొడ్డి నిలబడి తన పిల్లల్ని తిరిగి ఎలా కలుసుకుంది..? ఇందుకోసం ఒక సాధారణ మాతృమూర్తి చేసిన పోరాటం ఎలాంటిది ? అనే నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా యొక్క ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
అషిమా చిబ్బర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్ ఎమ్మాయ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త బ్యానర్లు నిర్మిస్తున్నాయి. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. మార్చి 17న థియేటర్లలో విడుదల కాబోతుంది.