సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఆపై కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలాం లో ఒక ప్రత్యేక పాత్రలో రజిని కనిపించబోతున్నారు.
తాజాగా కాసేపటి క్రితమే రజినీకాంత్ 170వ సినిమా యొక్క అధికారిక ప్రకటన జరిగింది. కోలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ లైకా సంస్థ వ్యవస్థాపకుడు సుభాస్కరన్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని, తమ సంస్థలో ప్రెస్టీజియస్ తలైవర్ 170వ సినిమాను తెరకెక్కిస్తున్నామని అధికారిక ప్రకటన చేసారు. ఈ సినిమాకు జర్నలిస్ట్, రైటర్, డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని, 2024లో విడుదల చేస్తామని కూడా మేకర్స్ తెలియచేసారు.