సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. హీరో మంచు మనోజ్, దివంగత టీడీపీ నేతలు భూమా నాగిరెడ్డి, శోభా రెడ్డి దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికారెడ్డిల పెళ్లి మార్చి3న హైదరాబాద్ లో జరగనుంది. ఈ వేడుకకు కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం. కాగా బుధవారం మెహందీ వేడుక ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదని ప్రచారం జరుగుతోంది.