సినీపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ఒరియా స్టార్ నటుడు పింటు నంద (45) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. లివర్ డోనర్ దొరికినప్పటికీ, ఆయన బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ సాధ్యం కాలేదని వైద్యులు తెలిపారు. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.