నూతన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ IAF పైలట్‌గా కనిపించనున్నాడు. తాజాగా ఈరోజు మూవీ టీమ్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ఈ చిత్రంలో మిస్ యూనివర్స్ 2017 మానుషి చిల్లర్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమాని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ మరియు రినైసన్స్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించాయి.