మంచు వారింట పెళ్లి సంబరాలు అంబరాన్నంటేలా జరుగుతున్నాయి. హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి ఈ రోజు రాత్రి జరగనున్న నేపథ్యంలో రెండ్రోజుల నుండి పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలతో మంచు వారి కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.
మరి, పెళ్ళికి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ ని లక్ష్మి తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తూ, అభిమానులకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంది. తాజాగా కాసేపటి క్రితమే మనోజ్ కి పసుపు రాసి పెళ్ళికొడుకుని చేస్తున్న పిక్ ను లక్ష్మి ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ పిక్ లో మనోజ్ ఎంతో సంతోషంగా కనబడుతున్నారు.
పోతే, భూమా నాగిరెడ్డి, శోభల కూతురు నాగమౌనిక ను మనోజ్ రెండో వివాహం చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి గతంలోనే ప్రచారం జరగ్గా, ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మేషన్ అందుతుంది.