నటి నిత్యామీనన్ గతంతో పోల్చితే చాలా సన్నబడి కనిపిస్తోంది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటో వైరల్ అయ్యింది. హైవే పక్కన షూట్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ వివరాలను త్వరలో వెళ్లడిస్తానంటూ నిత్యామీనన్ పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో నిత్యామీనన్ సన్నగా కనిపించడంతో పాటు ఫిట్ బాడీతో స్టైలిష్ గా కనిపిస్తోంది. ఇటీవల తమిళంలో అమ్మ జయలలిత బయోపిక్ లో నటించిన నిత్యామీనన్ ఆ పాత్రకు తగ్గట్లుగా లావు అయ్యింది. కొత్త సినిమా కోసం ఈమె ఇలా బక్కగా అయినట్లుగా అనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa