ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెట్రో మెలోడీగా 'ఫలానా అబ్బాయి' టైటిల్ ట్రాక్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2023, 06:50 PM

శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందిన ఫీల్ గుడ్ లవ్ ఎమోషనల్ డ్రామా "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి". నాగసౌర్య, మాళవికా నాయర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా టైటిల్ ట్రాక్ విడుదలయ్యింది. ఫలానా అబ్బాయ్.. ఫలానా అమ్మాయ్.. ఇవాళే కలిశారు తొలిసారిగా... అని సాగే ఈ రెట్రో మెలోడీని కళ్యాణి మాలిక్ స్వరపరచగా, ధనుంజయ్, నూతన మోహన ఆలపించారు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు. పోతే, ఈ చిత్రం మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa