సాలిడ్ హిట్ కొట్టాలనే కసి, పట్టుదలతో యంగ్ హీరో ఆది సాయికుమార్ వరసపెట్టి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఐతే, ఇప్పటివరకు విడుదలైన సినిమాలేవీ కూడా ఆదికి బిగ్ బ్రేక్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల దృష్టాంతా రేపు విడుదల కాబోయే 'CSI సనాతన్' మీదే ఉంది.
శివ శంకర్ దేవ్ దర్శకత్వంలో క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా యొక్క ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి డీసెంట్ అప్లాజ్ వచ్చింది. తాజాగా ఈ రోజు ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని తెలుస్తుంది. ఈ సినిమాలో మిషా నారంగ్ హీరోయిన్ గా నటించింది. మరి, రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ఆది కెరీర్ కి బిగ్ మైల్ స్టోన్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa