ప్రముఖ మోడల్ రోమన్ షాల్‌తో బాలీవుడ్ నటి సుస్మితసేన్ కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఈ ఏడాదిలో వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి గురించి సుస్మిత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘ఈ పెళ్లిళ్లను ఎవడు కనిపెట్టాడో.. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానంటే.. నువ్వు ఎప్పుడూ నన్ను వదిలి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చూస్తాను’ అంటూ రోమన్‌పై తనకున్న ప్రేమను పరోక్షంగా వ్యక్తం చేసింది. ఈ పోస్ట్ కాస్తా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. పెళ్లి గురించి సుస్మిత జనాల్లో తప్పుడు అభిప్రాయాలను పుట్టిస్తున్నారంటూ తిట్టిపోస్తున్నారు. ‘పెళ్లి చేసుకోవాలా.. వద్దా.. అన్నది నీ ఇష్టం. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వీటిపై సుస్మిత స్పందిస్తూ మరో ఫన్నీ పోస్ట్ పెట్టింది. ‘మా టీచర్ స్కేల్‌ను నావైపు చూపిస్తూ.. ‘ఈ స్కేల్ చివర్లో ఓ ఇడియట్ ఉన్నాడు’ అంది. అప్పుడు నేను.. ‘ఏ చివర్లో టీచర్’ అని అడిగినందుకు నన్ను బయటికి పంపించేసింది’ అంటూ నెటిజన్ల నోరుమూయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa