ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిల్లర్ వివరాలు వెల్లడించిన 'పులి మేక' మేకర్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 05:34 PM

లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్‌ జంటగా నటించిన ZEE5లోని 'పులి మేక' వెబ్‌ సిరీస్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ షో OTT ప్లాట్‌ఫారమ్‌లో 120 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలని క్లాక్ చేసింది. ఈ వెబ్ సిరీస్ లో IPS అధికారి (కిరణ్ ప్రభ) పాత్రలో లావణ్య త్రిపాఠి నటించింది. కానీ, అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మేకర్స్ ఇప్పుడు లావణ్య త్రిపాఠి కిల్లర్ అని వెల్లడించారు. 'కిరణ్ ప్రభ సీరియల్ కిల్లర్‌గా ఎందుకు మారిపోయింది? ఆమె ఏ రహస్యాలను దాచింది?' అంటూ నటుడు నితిన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. సుమన్, రాజా చెంబోలు, సిరి హన్మంత్, ముక్కు అవినాష్, గోపరాజు రమణ, స్పందన పల్లి, సాయి శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించారు. పంతం సినిమా ఫేమ్ చక్రవర్తి రెడ్డి ఈ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించగా, కోన వెంకట్ ఈ సిరీస్ ని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa