యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ లో భీమ్లా నాయక్ చిత్రంతో ఈ అమ్మడి హవా మొదలైంది. గ్లామర్ తో పాటు హుషారైన హీరోయిన్ గా సంయుక్త గుర్తింపు సొంతం చేసుకుంది. గత ఏడాది బింబిసార చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ మలయాళీ బ్యూటీ.
టైం ట్రావెల్ నేపథ్యంలో సాగిన బింబిసార చిత్రంలో సంయుక్త మీనన్ కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ లోకి అడుగు పెట్టగానే సంయుక్త మీనన్ కి వరుస విజయాలు దక్కుతున్నాయి. వరుస విజయాలతో టాలీవుడ్ లో సంయుక్త మీనన్ క్రేజ్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా సంయుక్త సూపర్ యాక్టివ్ గా ఉంటూ ప్రతి అంశాన్ని అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సంయుక్త మీనన్ నటించిన సార్ చిత్రం కూడా పంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.
తాజాగా సంయుక్త మీనన్ మరోసారి తన గ్లామర్ తో మెస్మరైజ్ చేసింది. కలర్ఫుల్ గా ఉన్న డ్రెస్ లో సంయుక్త తన ఎద ఒంపులతో కుర్రకారు హృదయాల్ని టార్గెట్ చేసింది. మాతిపోగొట్టేలా ఉన్న ఎద సౌందర్యం, అంతకి మించేలా ఉన్న ఆమె పెదవులు, చూపులు పిచ్చెక్కించేలా ఉన్నాయి. తన మునివేళ్ళని పరువాలపై పెట్టి సంయుక్త ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. సంయుక్త మీనన్ ఇదే జోరు కొనసాగిస్తే త్వరలోనే టాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె నటించిన రెండు చిత్రాలు వరుసగా విజయం సాధించడం అదృష్టం అనే చెప్పాలి.
Pretty Samyuktha Menon Latest Clicks #SamyukthaMenon #Samyuktha #TamilCinema #mutamilradio pic.twitter.com/wZc63iJ4Yj
— Mutamil Radio (@MutamilRadio) March 26, 2023