సినిమా ప్రేమికులకు ఒకే..రెడీ..యాక్షన్ అనే మాట నిత్యం వినిపిస్తూ ఉండాలి. లేకపోతే తట్టుకోలేరు. అందుకే ఎక్కువ కాలం సినిమాలకు దూరంగా ఉండలేరు నటీనటులు. చాలా కాలంగా సోనాలి బింద్రే కెమెరాకు దూరంగా ఉంది. కేన్సర్‌తో పోరాడి గెలిచిన నటి బింద్రే. ఈ వ్యాధిన బారిన పడినప్పుడు కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోరాడింది. ఈమె జీవితంలో ఎంతోమంది కేన్సర్ బాధితులకు స్ఫూర్తి. ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకొచ్చింది. ఆ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు ద్వారా పేర్కొంది. అంతేకాదు వ్యానిటీ వ్యాన్ ఎక్కేముందు మరో భావోద్వేగమైన వీడియో పోస్టు చేసింది. 'సుదీర్ఘ సెలవులు అనంతరం మళ్లీ కెమెరా ముందుకెళుతున్నా. ఈ అందమైన భావోద్వేగాన్ని మాటల్లో చెప్పలేను' అని పేర్కొంది. సోనాలి న్యూయార్క్‌లో కేన్సర్ ట్రీట్‌మెంట్ చేసుకుంది. ఆ విషయాన్ని 2018 ఏప్రిల్‌లో సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. ఆ సమయంలో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈమెకు ధైర్యాన్ని నింపారు. గత ఏడాది డిసెంబర్ మూడో తేదీన ఇండియాకు తిరిగొచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa