ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘అర్జున్ సురవరం’ గా వస్తున్న నిఖిల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 04, 2019, 02:48 PM

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాకు మొదట ‘ముద్ర’ అనే టైటిల్‌ను ఖరారుచేసిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ లోగోతో పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే ఈ టైటిల్ వివాదాన్ని తెచ్చిపెట్టింది. ఇదే పేరుతో జగపతిబాబు హీరోగా మరో సినిమా రావడం, నిఖిల్ ‘ముద్ర’ పోస్టర్లు వాడుకుని బుకింగ్ యాప్‌లలో ఆ చిత్రం టిక్కెట్లను విక్రయించడం వివాదాస్పదమైంది. తన పేరు, చిత్ర లోగో, పోస్టర్లను వాడుకుని ‘ముద్ర’ సినిమా టిక్కెట్లను అమ్ముకున్నారని నిఖిల్ ఆరోపించారు. అది తన సినిమా కాదని, తన ‘ముద్ర’ విడుదలకు ఇంకా సమయం ఉందని నిఖిల్ ప్రకటించారు. ఆ తరవాత జగపతిబాబు ‘ముద్ర’కు నిర్మాత అయిన నట్టికుమార్.. నిఖిల్‌పై ఫైర్ అవ్వడం, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం తెలిసిందే. 


 


ఈ వివాదం కారణంగా తమ సినిమా టైటిల్ మార్చాలని హీరో నిఖిల్, దర్శకనిర్మాతలు నిర్ణయించారు. మార్చిన టైటిల్‌తో సోమవారం చిత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. సినిమాలోని హీరో పేరునే టైటిల్‌గా పెట్టారు. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్టు అర్జున్ లెనిన్ సురవరంగా కనిపించనున్నారు. ఆ పేరులోని ‘అర్జున్ సురవరం’ను చిత్ర టైటిల్‌గా పెట్టారు. అలాగే, చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించారు. మార్చి 29న ‘అర్జున్ సురవరం’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’కి రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ వర్షన్‌కు కూడా టి.ఎన్.సంతోషే దర్శకత్వం వహించారు. సామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్నారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa