ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీక్వెల్ షూటింగ్ ని ప్రారంభించిన పాన్ ఇండియన్ ఫిల్మ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 14, 2023, 08:17 PM

ఆర్ చంద్రు దర్శకత్వంలో శాండల్‌వుడ్ స్టార్ హీరోస్ ఉపేంద్ర అండ్ కిచ్చా సుదీప్ నటించిన మల్టీస్టారర్ 'కబ్జా' బాక్స్ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ సినిమా కేజీఎఫ్‌కి కార్బన్ కాపీ అని పలువురు అభిప్రాయపడ్డారు. తాజాగా ఇప్పుడు, కబ్జా మూవీ మేకర్స్ ఈ సినిమా సీక్వెల్ చిత్రీకరణను ప్రారంభించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రకటించడానికి తుపాకీ మరియు కుర్చీని కలిగి ఉన్న పోస్టర్ ని మూవీ మేకర్స్ విడుదల చేసారు.

ఈ సినిమాలో శ్రియ శరణ్, కిచ్చా సుదీప్ మరియు శివ రాజ్‌కుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు. మురళీ శర్మ, సుధ, జాన్ కొక్కెన్, సుధ, అనూప్ రేవన్న ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకి రవి బస్రూర్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com