మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా ‘విరూపాక్ష’. ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు 'ఏ' జారీ చేసింది.ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదల కానుంది. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు.