కార్తీక్ దండు దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఒక ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఏప్రిల్ 21, 2023న విడుదల కానుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ పాన్-ఇండియన్ చిత్రం యొక్క తమిళనాడు హక్కులను ప్రముఖ బ్యానర్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేసేందుకు ప్రొడక్షన్ హౌస్ భారీ ప్లాన్స్ చేస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.