దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ RRR నిత్యం వార్తల్లో ఉంటుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తుండటం.. బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తోన్న సినిమా కావడంతో RRRపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కంటే.. రూమర్లు ఎక్కువగా షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ అన్నాదమ్ములుగా కనిపిస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చెర్రీ పోలీస్‌గా కనిపిస్తే.. తారక్ బందిపోటుగా నటిస్తున్నారని కూడా వార్తలొచ్చాయి.
ఈ సినిమాలో ప్రధాన విలన్ ఎవరు? అన్నది ఇప్పటివరకూ సస్పెన్స్. ఓవైపు రెండో షెడ్యూల్ చిత్రీకరణ సాగుతుండగానే రాజమౌళి పలువురు విలన్ల పేర్లను పరిశీలించారట. అందులో తొలిగా బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ ఓ ఆప్షన్ అని తెలుస్తోంది. రాజమౌళి తెరకెక్కించిన `ఈగ` చిత్రానికి హిందీ వెర్షన్ డబ్బింగ్ చెప్పారు దేవగన్ - కాజోల్ జంట. ఆ చొరవతోనే అజయ్ దేవగన్ ని రాజమౌళి సంప్రదించారట. ఆర్.ఆర్.ఆర్ లో కీలక పాత్రలో నటించాల్సిందిగా కోరారట. అయితే దేవగన్ ఆ ఆఫర్ ని తిరస్కరించారని తెలుస్తోంది.
అతడు ఆ ఆఫర్ ని కాదనుకోగానే రాజమౌళి వెంటనే కిలాడీ అక్షయ్ ని సంప్రదించారని అయితే ఇంకా ఇది చర్చల దశలోనే ఉందని తెలుస్తోంది. ఒకవేళ అక్షయ్ ఈ సినిమాని అంగీకరిస్తే అతడు సెలెక్ట్ చేసుకున్న రెండో అతిపెద్ద సౌత్ సినిమా అవుతుంది. శంకర్ 2.0 తర్వాత ఆర్.ఆర్.ఆర్ అక్కీకి పెద్ద ప్లస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక అజయ్ దేవగన్ ఇదివరకూ `భారతీయుడు 2` ఆఫర్ ని కాదనుకున్నారు. దాదాపు 300కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్.ఆర్.ఆర్ ను కాదనుకోవడంతో రెండోసారి క్రేజీ ఆఫర్ ని కోల్పోయారని విశ్లేషణ సాగుతోంది. ఆ మేరకు ప్రఖ్యాత టైమ్స్ నవ్ ఓ కథనాన్ని ప్రచురించడం సంచలనమైంది. అలాగే ఈ చిత్రంలో కథానాయికల్ని ఎంపిక చేయాల్సి ఉంది. బాలీవుడ్ భామలు జాన్వీ ఆలియా పరిణీతి వంటి నాయికల పేర్లను పరిశీలిస్తున్నారన్న సమాచారం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa