అతిలోక సుందరి నటవారసురాలిగా జాన్వీ వెలుగులు ప్రసరిస్తున్న సంగతి తెలిసిందే. ధడక్ సినిమాతో జాన్వీ విజయం అందుకుంది. ద్వితీయ ప్రయత్నం భారీ మల్టీస్టారర్ తక్త్ లో నటిస్తోంది. ఈలోగానే రణవీర్ సింగ్ - విక్కీ కౌశల్ వంటి స్టార్ల సరసన ఈ అమ్మడికి అవకాశాలు అంటూ ప్రచారం సాగుతోంది. మరోవైపు టాలీవుడ్ ఎంట్రీ పైనా వేడెక్కించ చర్చ సాగుతోంది. ఎస్.ఎస్.రాజమౌళి అతిలోక సుందరి వారసురాలికి అవకాశం ఇచ్చి రుణం తీర్చుకుంటారా? అంటూ ఇటీవల మాట్లాడుకున్నారు.
అయితే స్టార్ డమ్ అందుకోవడం అంత సులువా? గ్లామర్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో నటవారసుల టైమ్ అయిపోయింది. కొత్త కొత్త అందాలు పుట్టుకొస్తున్నాయి. ప్రతిభలో ఒకరిని మించి ఇంకొకరు. అందుకే జాన్వీ ఎంతో జాగ్రత్త పడుతోంది. వీలున్న ప్రతి వేదికపైనా తన అందచందాల్ని ఎలివేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతి ఫ్యాషన్ ఈవెంట్ ని తప్పనిసరిగా ఒడిసిపడుతోంది. తాజాగా ఫిలింఫేర్ సందడి పీక్స్ లో ఉంది. ఈ వేడుకల్లో జాన్వీ సరికొత్త డిజైనర్ లుక్ తో మతి చెడగొట్టింది.
పాము పొర విడిచిందా? అన్నట్టు ఉల్లి పొర ఛమ్కీల డ్రెస్ లో ప్రత్యక్షమై అందరికీ షాకిచ్చింది. జాన్వీ లుక్ స్టన్నింగ్.. అంటూ ప్రశంసలు వస్తున్నాయి. ఈ ట్రెండ్ ని ఇలానే కంటిన్యూ చేస్తూ.. దర్శకనిర్మాతల్ని తనవైపు తిప్పేసుకునే ప్రయత్నం చేస్తోందా? అంటూ బోయ్స్ లో ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజా వీడియోని వైరల్ భయానీ ఇన్ స్టా గ్రమ్ లో షేర్ చేశారు. ఇంతకీ జాన్వీ టాలీవుడ్ కి వచ్చేది ఎప్పుడో?
#JanhviKapoor on the red carpet of the #GlamourAndStyleAwards pic.twitter.com/9BaQ4AqJZE
— Janhvi Kapoor Universe (@JanhviKUniverse) February 13, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa