ఓటీటీ ప్రసారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇక నుంచి ఓటీటీ కంటెంట్‌కి కూడా పొగాకు వ్యతిరేక యాడ్స్ వర్తిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పొగాకు వ్యతిరేక ప్రకటనలు సినిమా ప్రారంభంలో ప్రసారం చేయాలని, ఏ భాషలో కంటెంట్ ఉందో అదే భాషలో పొగాకుకి వ్యతిరేక హెచ్చరికలు ఉండాలని సూచించింది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.