చల్ మోహనరంగా, లై, రావణాసుర తదితర చిత్రాలతో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది మేఘా ఆకాష్. కాగా త్వరలోనే ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడి కుమారుడితో మేఘా ఆకాష్ పెళ్లి ఫిక్స్ అయినట్లు ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు బాగా వినిపిస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహంగా త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.