మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం అంటూ కొన్నిరోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. వరుణ్ తేజ్ టీం నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను షేర్ చేశారు.
జూన్ 9న వరుణ్, లావణ్య ఎంగేజ్ మెంట్ జరగనున్నట్లు ఈ పత్రిక ద్వారా తెలుస్తోంది. ఊహించినట్లుగానే దీనిపై అధికారిక క్లారిటీ వచ్చింది. మరి వీరిద్దరూ అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు కానీ ఇప్పుడు జూన్ 9న పెద్దల సమక్షంలో నిశ్చితార్థానికి సిద్ధమవుతున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఈ శుభవార్తతో అభిమానులు మరియు ఫిల్మ్ సర్కిల్స్ యువ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.