మెగా ఫ్యామిలీలో సంబరాలు మిన్నంటాయి. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మూడో తరం అడుగిడింది. రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు అపోలో ఆస్పత్రి ప్రకటన విడుదల చేసింది. అభిమానులు మెగా వారసురాలు వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు.